Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా విచారణ చేపట్టింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన NCW.. తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. కేసులో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి, నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఏడు రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ పోలీసులను కోరింది.
నిందితుడిపై కఠిన చర్యలు
NCW చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి రాసిన లేఖలో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని, ఘటనకు సంబంధించిన పూర్తి పరిణామాలు, హత్యకు గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే నిందితుడి పూర్వ నేరచరిత్రపైనా పూర్తిస్థాయిలో ఆరా తీయాలని సూచించారు.
Also Read
- CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
- Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
- Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
- Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
ఆధారాలపై ప్రత్యేక దృష్టి
అత్యాచారం, హత్య, క్రిమినల్ ట్రెస్‌పాస్‌కు సంబంధించిన BNS సెక్షన్లను కఠినంగా అమలు చేయాలని NCW స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలను భద్రపరిచి సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది. CDRలు సహా ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తులో భాగం చేయాలని సూచించింది.
కుటుంబానికి రక్షణ, న్యాయ సహాయం
బాధితురాలి కుటుంబానికి తగిన రక్షణ, భద్రత కల్పించడంతో పాటు అవసరమైన న్యాయ సహాయం అందించాలని NCW ఆదేశించింది. కుటుంబానికి వర్తించే చట్టబద్ధ పరిహారాన్ని కూడా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఏడు రోజుల్లో నివేదిక
కేసు దర్యాప్తు పురోగతిపై ఏడు రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ పోలీసులను NCW కోరింది. దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, ఛార్జ్‌షీట్ దాఖలు గడువు, కేసు పర్యవేక్షణకు తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. పనిచేసే మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీపడేది లేదని జాతీయ మహిళా కమిషన్ తేల్చిచెప్పింది.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
OTR: సొంత జిల్లాలో రామ్మోహన్‌కు అసంతృప్తి సెగ?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!