Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా తెరకెక్కిన భారీ చిత్రం ‘రామాయణ’ క్రేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటిపోయింది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా, అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే భారత్‌లోనే కాకుండా.. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ ఈ సినిమా ఫీవర్ మామూలుగా లేదు. కరాచీ నగరంలోని ఓ ప్రముఖ ఆలయంలో అక్కడి స్థానిక హిందువులు ‘రామాయణ’ సినిమా పోస్టర్‌కు ప్రత్యేక పూజలు చేస్తూ హారతులు ఇస్తున్న దృశ్యాలను సుమిత్ చంద్ర అనే లోకల్ యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
“పాకిస్థాన్‌లో ఉంటున్న మాకు ‘రామాయణ’ అనేది కేవలం రెండు గంటల సినిమా మాత్రమే కాదు. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆత్మగౌరవం, తరతరాల సంస్కృతి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాలి” అంటూ అక్కడి ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్ల పాక్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా లేదా అన్నది ఇంకా తేలనప్పటికీ.. కరాచీ గుడిలో పోస్టర్ పెట్టి సంబరాలు చేసుకునే స్థాయికి క్రేజ్ చేరడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?