TSRTC : గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించిన టీఎస్ఆర్టీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది. వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థ బాగుతో పాటు ప్రయాణీకుల రవాణా సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ దిశలో వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ మెరుగైన సేవలు అందించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు . ‘ప్రజా ఆదరణ -సంస్థకు ప్రేరణ’ గా భావించిన ఆయన ప్రయాణీకులకు మరో శుభవార్త అందించారు. బస్సు ఛార్జీలు పెంచడమే కానీ తగ్గించడం లేదు అనే మాటను తుడిచేశారు. తాజాగా గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నడుస్తున్న ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా సవరించడం కొసమెరుపు. దీంతో ప్రయాణీకులు ఎంచక్కగా రాజధాని ఫేర్ తో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు. ఈ సవరించిన / తగ్గించిన ఛార్జీలు షెడ్యూల్ , ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి.
కాగా అంతరాష్ట్ర సర్వీసులో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తరువాత అంతకు మునుపు ఉన్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. కర్ణాటక ఆర్టీసీతో సమానంగా ప్లెక్లీ ఛార్జీలు అమలులో ఉన్న హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడడానికి ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ .100 , హైదరాబాద్ – ఆదిలాబాద్ మధ్య రూ .111 , హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ .121 , హైదరాబాద్- వరంగల్ మధ్య రూ .54 లు తగ్గినట్లు ఆయన వివరించారు. ప్రయాణీకుల సమస్యలపై ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం జరుగుతోందని తెలిపారు. ప్రజా రవాణా సేవల్ని వినియోగించుకుంటున్న ప్రయాణీకులు ఆర్టీసీని మరింత ఆదరించి సంస్థ అభ్యున్నతికి దోహదపడాలని ఆయన కోరారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Tags
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!