Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని హన్సి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హత్యాకాండ చోటుచేసుకుంది. ఫవ్వారా చౌక్ సమీపంలో తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో, కపిల్ అనే రెడ్ జిమ్ యజమాని యువతీ యువకులకు వ్యాయామ శిక్షణ ఇస్తుండగా ఈ దాడి జరిగింది. హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు, కపిల్‌ను లక్ష్యంగా చేసుకుని అతి సమీపం నుండి దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దుండగులు అతని తల, వీపు భాగాలను గురిచేసి కాల్చడంతో కపిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఆకస్మిక కాల్పుల సమయంలో అక్కడ వ్యాయామం చేస్తున్న శిఖ అనే మహిళకు కూడా బుల్లెట్ గుర్తులు (పెల్లెట్స్) తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం హిసార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (CIA), ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశాయి.
Also Read
- Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
- Fake Bomb Threat Case: 800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నైలో చిక్కిన నిందితుడు!
- Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
- Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు..
ఈ హత్య జరిగిన కొద్దిసేపటికే, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన హరి బాక్సర్ అనే సభ్యుడు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేస్తూ ఈ హత్యకు తామే బాధ్యులమని ప్రకటించాడు. తనతో పాటు ఆర్డి ధలివాల్, హర్మాన్ సంధు, విక్రమ్ కాధల్ కలిసి ఈ దాడికి వ్యూహం రచించినట్లు పేర్కొన్నాడు. గతంలో షేక్‌పురా ధరిక్పురియాలో జరిగిన కాల్పుల ఘటనలో కపిల్ తమ ప్రత్యర్థులకు కుట్రపూరితంగా సహకరించాడని, అందుకే అతడిని అంతమొందించామని ఆడియోలో తెలిపాడు. ఈ విషయమై గతంలో తమ అనుచరుడు సుందర్ హన్సి ద్వారా కపిల్‌ను రెండుసార్లు హెచ్చరించినప్పటికీ అతను వినలేదని పేర్కొన్నాడు.
అంతేకాకుండా.. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటనకు కూడా తమ గ్యాంగే కారణమని, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సన్నిహితంగా ఉంటున్న సదరు వ్యక్తికి ఎంత భద్రత ఉన్నా వదిలిపెట్టబోమని ఆ ఆడియోలో తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటూ ఈ తరహా దాడులకు పాల్పడుతున్న బిష్ణోయ్ గ్యాంగ్ కదలికలు పోలీసు వ్యవస్థకు పెద్ద సవాల్‌గా మారాయి.
తాజావార్తలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!