తెలంగాణ ఆర్టీసీ దూకుడు మీద ఉంది. పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసిన సజ్జనార్ ఆర్టీసీలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని క్రమంగా ప్రజలకు చేరువ చేస్తూ లాభాల బాట ఎక్కించేందుకు సజ్జనార్ ఎన్నో వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా పలుమార్లు స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త సర్వీసులు, ట్రిప్పులతో ప్రజలకు ఆర్టీసీని…