TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు.. కస్టడీకి 9మంది నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Paper Leak Accused Handed Over To SIT For 6 Six Days Custody: TSPSC పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన అనుమతితో.. చంచల్‌గూడ జైలులో ఉన్న 9 మంది అధికారుల్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలుత సిట్ అధికారులు 10 రోజుల పాటు నిందితుల కస్టడీ కావాలని కోర్టులో పిటిషన్ వేయగా.. ఆరు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఈరోజు కస్టడీలోకి తీసుకున్న అధికారులు, ఆరు రోజుల పాటు అంటే మార్చి 23వ తేదీ వరకు వారిని విచారించనున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూపి లాగనున్నారు. ప్రశ్నాపత్రం ఎవరెవరికి విక్రయించారనే దానిపై ఆరా తీయనున్నారు.
Boyfriend Suicide: ప్రియురాలు మాట్లాడట్లేదని.. ఉరేసుకున్న టెక్కీ
Also Read
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
ఇదిలావుండగా.. అంతకుముందు ఈ పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్‌పీఎస్‌సీకి ఇచ్చిన నివేదికలో సిట్ కొన్ని కీలక విషయాల్ని వెల్లడించింది. ఈ లీకేజ్‌లో ప్రధాన సూత్రధారి రాజశేఖరే అని, ఉద్దేశపూర్వకంగానే అతడు పేపర్ లీక్ చేశాడని అధికారులు తేల్చారు. సిస్టమ్ ఆపరేటర్‌గా పని చేస్తున్న రాజశేఖర్.. కంప్యూటర్‌ని హ్యాక్ చేసి, పాస్‌వర్డ్‌ని తొలగించినట్టు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేసి, ఆ పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కి ఇచ్చినట్టు చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీనే ఏఈ పేపర్‌ను రాజశేఖర్ కాపీ చేశాడని, ఆ పేపర్‌ను రేణుకకు ప్రవీణ్ అమ్మాడని వెల్లడించారు. అదే సమయంలో గ్రూప్-1 ప్రశ్నాపత్ర కూడా లీకైనట్టు అధికారులు గుర్తించారు. సెక్రటరీ దగ్గర పని చేస్తున్న ప్రవీణ్.. గ్రూప్-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు సిట్ నిర్ధారించింది. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్న నిందితుల్ని విచారించి.. ఈ లీకేజ్ వెనుక ఉన్న ప్రతీ సమాచారాన్ని బయటకు లాగేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.
Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్‌ను చంపడమే నా జీవిత లక్ష్యం.. జైలు నుంచే బిష్ణోయ్ బెదిరింపు
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులోని నిందితులు:
ఏ -1 ప్రవీణ్ కుమార్, ఏ -2 అట్ల రాజశేఖర్, ఏ -3 రేణుక రాథోడ్, ఏ -4 డాక్య, ఏ- 5 కేతావత్ రాజేశ్వర్, ఏ -6 కేతావత్ నీలేష్ నాయక్, ఏ -7 పత్లావత్ గోపాల్ నాయక్, ఏ -8 కేతావత్ శ్రీనివాస్, ఏ -9 కేతావత్ రాజేంద్ర నాయక్.
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!