Boyfriend Suicide: ప్రియురాలు మాట్లాడట్లేదని.. ఉరేసుకున్న టెక్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Techie Hangs Himself Because Girlfriend Blocked His Number: హైదరాబాద్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయితో తనతో మాట్లాడటం లేదని మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలు తనని దూరం పెట్టిందని, తన ఫోన్ నెంబర్‌ని బ్లాక్‌లో పెట్టిందంటూ సూసైడ్ నోట్ రాసి, ఉరి వేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సదాశివపేట ఆరూరు గ్రామానికి చెందిన అఖిల్ (28), గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. చందానగర్‌లోని ఓ లాడ్జ్‌లో నివాసం ఉంటున్న ఈ టెక్కీ.. ఓ యువతిని ప్రేమించాడు. మొదట్లో వీరి ప్రేమకథ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్నట్టుగా బాగానే సాగింది. ఇద్దరు కలిసి షికార్లకు వెళ్లడం, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి సరదాగా గడపడం లాంటివి చేశారు.
Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్‌ను చంపడమే నా జీవిత లక్ష్యం.. జైలు నుంచే బిష్ణోయ్ బెదిరింపు
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
అలాంటి ఈ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. ఆ యువతి అఖిల్‌ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. తొలుత కలవడాన్ని నిరాకరించింది. తనని డిస్ట్రర్బ్ చేయొద్దని, ఇకపై తనతో మాట్లాడొద్దని చెప్పింది. ఆపై అతని ఫోన్ నంబర్ బ్లాక్‌లో కూడా పెట్టేసింది. అయితే.. అఖిల్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ప్రియురాలిని విడిచి ఉండలేకపోయాడు. ఆమెకు తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. దీంతో.. మనస్తాపానికి గురైన అఖిల్, ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఉంటున్న లాడ్జ్‌లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడటం లేదని, ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్.. ఓ ఇంటివాడయ్యాడు..
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!