TS EAPCET Results 2024: తెలంగాణ TS EAPCET పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఉదయం జెఎన్‌టియుహెచ్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. పురుషుల కన్నా మహిళలే ఎక్కువ క్వాలిఫై అయ్యారని తెలిపారు. టాప్ 10 లో ఒకే అమ్మాయి 10th ర్యాంక్ సాధించిందన్నారు. ఇంజనీరింగ్, అగ్రి రెండు స్ట్రీమ్ లలోనూ ఏపీ విద్యార్థులదే మొదటి ర్యాంకు సాధించారన్నారు. ఇక ఎంసెట్ ఫలితాల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే రావడం విశేషం. దీంతో ఇంజనీరింగ్ విభాగంలో సత్యవాడ జ్యోతి రాధిత్యకు ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలోనూ ఏపీ విద్యార్థిని ప్రణీతకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. హర్ష- రెండో ర్యాంకు రాగా.. రిషి శేఖర్ శుక్లా- మూడో ర్యాంకు సాధించారు. సందేశ్- నాలుగో ర్యాంకు.. యశ్వంత్ రెడ్డి- ఐదవ ర్యాంకు సాధించారు.
Read also: TS EAPCET Results 2024: ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్ 10 లో..
కాగా.. Eapcet ఇంజనీరింగ్ విభాగంలో సత్యవాడ జ్యోతిరాధిత్యకు ఫస్ట్ ర్యాంక్ రాగా, హర్ష అనే విద్యార్థికి రెండో ర్యాంకు వచ్చింది. రిషి శేఖర్ శుక్లా అనే విద్యార్థికి మూడో ర్యాంకు వచ్చింది. సందేశ్‌కు నాలుగో ర్యాంకు, యశ్వంత్ రెడ్డికి ఐదో ర్యాంకు వచ్చింది. కాగా.. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో AP విద్యార్థులకు టాప్ ర్యాంకులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జ్యోతిరాధిత్యకు ఫస్ట్ ర్యాంకు రాగా.. కర్నూల్ జిల్లాకు చెందిన హర్షకు రెండో ర్యాంకు వచ్చింది. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలోనూ ఏపీ విద్యార్థులదే టాఫ్ లో వున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రణీతకు ఫస్ట్ ర్యాంకు రాగా.. విజయనగరం జిల్లాకు చెందిన రాధాకృష్ణకు రెండో ర్యాంకు సాధించారు. వచ్చే వారంలో అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు బుర్రా వెంకటేశం ప్రకటించారు. జూన్ రెండు కన్నా ముందే ఎంట్రెన్స్ జరిగింది కాబట్టి.. ఏపీ విద్యార్థులకు కూడా సీట్లు ఉంటాయన్నారు. అర్హత సాధించిన విద్యార్థులకు అందరికీ సీట్లు ఉన్నాయి.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కంటే ఇంజనీరింగ్ లో అర్హత శాతం తగ్గిందన్నారు. అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్ లో లక్ష 432 మంది దరఖాస్తు చేసుకుంటే 91 వేల 633 మంది అనగా.. 91.24% హజరయ్యారన్నారని తెలిపారు. 82 వేల 163 మంది క్వాలిఫై.. 89.7 శాతం క్వాలిఫై అయ్యారన్నారు.
CM Jagan London Tour: లండన్ పర్యటకు సీఎం జగన్.. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్..!