ఎంసెట్‌లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ (ఏఎం) ప్రవేశ పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో మొదటి సెషన్ ఉదయం 9 ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల ముగుస్తుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 94 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్‌లో 19 సహా 108 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.…