బీజేపీ నేతలకు సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించిన ఆయన.. తెలంగాణలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పట్టించుకోలేదు.. అందుకే ఐటీఐఆర్ రద్దు అంటున్నారు.. మరి బెంగుళూరులో ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. 2014 నుండి మేం కేంద్ర మంత్రులను కలుస్తున్నామన్న ఆయన.. అనేక సార్లు లేఖలు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు.. మేం చెప్పేదంట్లో తప్పు ఉంటే చెప్పండి ఎక్కడికి అయినా వచ్చి మాట్లాడటానికి మేం సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరిన రంజిత్‌రెడ్డి.. మేం విఫలం అయ్యాం అనుకుందాం.. మరి మీకు దమ్ము ఉందా…? ఐటీఐఆర్ తెస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నోటికి వచ్చినట్టు అబద్దాలు మాట్లాడితే సమాధానం ఇవ్వడానికి మేం సిద్ధంగా లేమన్నారు టీఆర్ఎస్ ఎంపీ.. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, సవాళ్ల పర్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.