కాంగ్రెస్ ఎల్లారెడ్డిలో నిర్వహించిన మన ఊరు-మన పోరు సభపై టీఆర్ ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిజామాబాద్ టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కౌంటర్ ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ రేవంత్ రెడ్డి, పీసీసీ నేతలపై విరుచుకుపడ్డారు. సభలో ఎల్లారెడ్డి ప్రజలు లేరు, బయట నుంచి తెచ్చుకున్నారు. నువ్వు పట్ట పగలు దొరికిన 420 గాడివి. నిన్ను ప్రజలు పిచ్చి కుక్క అంటున్నారని విమర్శించారు ఎమ్మెల్యే సురేందర్.
స్టేజి మీద ఎల్లా రెడ్డి మీద ఒక్క నాయకుడు లేడని, అందరూ పీసీసీ చీఫ్ లాంటి కిరాయి నాయకులే వున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి జోకర్, బ్రోకర్. నీలాగా దొంగతనం గా నేను పార్టీలు మారలేదు. మన ఊరు, మన పోరు అని రేవంత్ రెడ్డి కథలు చెప్తున్నాడు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా.. అసలు నీ స్థాయి ఎంత? అని ఆయన ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశమే చూస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు,కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయ్ అని అడుగుతున్నా అన్నారు. వరివేసి ఇబ్బంది పడద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు చెప్పారు. ఎల్లారెడ్డి గడ్డ టి ఆర్ ఎస్ అడ్డా. నా నియోజవర్గంలో 2వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 40 సంవత్సరాలు లేని అభివృద్ధి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎల్లారెడ్డి లో జరుగుతోందన్నారు ఎమ్మెల్యే సురేందర్.
జహీరాబాద్ ఎంపీ బీ బీ పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రస్టేషన్ లో ఉందన్నారు. 8 ఏళ్ళ లో తన పార్లమెంట్ పరిధిలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిలో దేశంలో తెలంగాణ ముందు ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో తెలంగాణ పథకాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. నీతి ఆయోగ్ కూడా తెలంగాణను అభినందించిందన్నారు ఎంపీ బీబీ పాటిల్.