ఈటెలకు టచ్ లో ఉన్న వారి పేర్లు బయట పెట్టే దమ్మందా..? అంటూ.. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. ఈటెల ది వ్యాపార నైజం, ఆయనకు ఏ సిద్ధాంతం లేదని విమర్శించారు. గజ దొంగ పార్టీలో ఈటెల చేరి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ఈటెలకు బీజేపీలో ఏముందని నాయకులు ఆయనతో టచ్ లో ఉంటారని ప్రశ్నించారు. మోడీ రెండు నెలలు హైద్రాబాద్ లో ఉన్నా.. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడు అంటూ చురకలంటించారు.…
కాంగ్రెస్ ఎల్లారెడ్డిలో నిర్వహించిన మన ఊరు-మన పోరు సభపై టీఆర్ ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిజామాబాద్ టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కౌంటర్ ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ రేవంత్ రెడ్డి, పీసీసీ నేతలపై విరుచుకుపడ్డారు. సభలో ఎల్లారెడ్డి ప్రజలు లేరు, బయట నుంచి తెచ్చుకున్నారు. నువ్వు పట్ట పగలు దొరికిన 420 గాడివి. నిన్ను ప్రజలు పిచ్చి కుక్క అంటున్నారని విమర్శించారు ఎమ్మెల్యే సురేందర్. స్టేజి మీద ఎల్లా రెడ్డి…