Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య అంతిమ యాత్ర.. పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్‌పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్‌లో కృష్ణయ్య స్పాట్‌లోనే మృతి చెందారు. నేడు కృష్ణయ్య అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రూరల్ మండలంలో 144 సెక్షన్ విధించారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంత్యక్రియల్లో కృష్ణయ్య అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్రలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రవతిలు పాల్గొన్నారు.
తన భర్త తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావే కారణమని భార్య మంగతాయమ్య ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుతున్న తమ కుటుంబాన్ని చూసి ఓర్వలేకే ఈ హత్యకు పాల్పడ్డారని అన్నారు. సీపీఎం నాయకుల హత్య రాజకీయాలు, అక్రమాలను చూసే తాము పార్టీ నుంచి బయటకొచ్చామని తెలిపారు. హత్యలు చేస్తే బెదిరిపోయే రోజులు పోయాయని, ఇలాంటి ఘటనల వల్ల తమ కుటుంబం భయపడదని చెప్పారు. తాము ప్రజల కోసం పని చేశామని, ప్రజలు తమ వెంటే ఉంటారని వెల్లడించారు. హత్యకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన మంగతాయమ్మ.. నిందితుల్ని శిక్షించేవరకూ పోరాడుతామని అన్నారు.
Also Read
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Hyderabad: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రీకూతురు మృతి.!
- Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
- Telangana High Court: హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రంగనాథ్‌కు భారీ జరిమానా విధింపు..
అయితే.. కృష్ణయ్య హత్యతో సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం నేతలు చెప్తున్నారు. హత్యా రాజకీయాల్ని తమ పార్టీ ఏమాత్రం ప్రోత్సాహించదని, సీపీఎం నేతల ఇళ్లపై దాడులు చేయడం సరికాదని అన్నారు. మరోవైపు.. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విస్తృత స్థాయిలో విచారణ జరుపుతోంది. కృష్ణయ్యను హత్య చేసి, పారిపోయిన నిందితుల్ని కచ్ఛితంగా అరెస్ట్ చేస్తామని అన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ యంత్రాంగం తెలిపింది.
Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య అంతిమ యాత్ర.. పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!