Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Temple: అయోధ్య రాముడి గుడిలో కానుకల లెక్కింపు దగ్గర దాదాపు 105 సార్లు అక్రమాలు జరిగినట్లు సిట్ (SIT) సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. హుండీ లెక్కింపు గదిలో సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అనుమతి లేకుండా డబ్బులను పక్కన పెట్టడం లేదా దాచడం లాంటివి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని దర్యాప్తు బృందం వెల్లడించింది. ఈ హుండీ దొంగతనాల వ్యవహారంలో ఇప్పటివరకు ఏకంగా 173 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లు నమోదు చేశామని, సెప్టెంబర్ 25 నాటికల్లా కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దర్యాప్తు సమయంలో కొంతమంది అనుమానితులను కూడా గుర్తించామని, ఈ అక్రమాలు అసలు ఎవరెవరు చేశారు? ఎన్నిసార్లు చేశారనే విషయాలపై పూర్తి వివరాలు రాబడుతున్నామని సిట్ వివరించింది.
అయితే, సోషల్ మీడియాలోనూ వార్తల్లోనూ జోరుగా ప్రచారమైన వెండి ఇటుకలు, రాముడి పాదుకల మాయం వార్తలపై సిట్ క్లారిటీ ఇచ్చింది. భక్తులు సమర్పించిన 200 కిలోల వెండి ఇటుకలు, 38.288 కిలోల వెండి, వెండి హారం, రాముడి చరణ పాదుకలు, రామచరితమానస్ కాపీల దానాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రాథమిక విచారణలో తేల్చింది. దీనికోసం సంబంధిత వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా రికార్డులన్నింటినీ కూపీ లాగామని, అందులో ఎలాంటి తేడాలు లేవని తేల్చి చెప్పింది. మరోవైపు, రసీదులు లేకుండా వచ్చిన 86 రకాల విలువైన కానుకలను కూడా అధికారులు గుర్తించారు. టీసీఎస్ (TCS) సాఫ్ట్వేర్ ద్వారా రసీదులు పొందిన మరో 803 విలువైన కానుకలను పరిశీలించి, అవి సరిగ్గా ఉన్నాయని ధృవీకరించారు. ట్రస్ట్ రికార్డులను, ఎస్బిఐ (SBI) లాకర్లలో దాచిన కానుకలను స్వయంగా వెళ్లి భౌతికంగా తనిఖీ చేశారు. ఇక వెండిగా భావిస్తున్న సుమారు 944.411 కిలోల తెల్లటి లోహాన్ని కరిగించి అసలు విలువ తేల్చేందుకు ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’కు ట్రస్ట్ పంపగా, దానికి సంబంధించిన రికార్డులను కూడా సిట్ బృందం పరిశీలించింది. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన సుప్రీంకోర్టు, సిట్ నివేదికను రికార్డుల్లోకి తీసుకుంది. సిసిటీవీ ఫుటేజ్, బ్యాంక్ లాకర్లు, ట్రస్ట్ రికార్డుల ఆధారంగా సిద్ధం చేసిన ఈ నివేదిక తర్వాత, సెప్టెంబర్ 25న దాఖలయ్యే ఛార్జ్‌షీట్‌లో మరిన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉంది.
Also Read
- Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
- Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
తాజావార్తలు
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Women’s Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!