శుక్రవారం ధర్నాలు.. కేసీఆర్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. అందులోభాగంగా కేంద్రంపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నారు.. ఇది నీ చేతకాని తనం కాదా? అంటూ ఫైర్ అయ్యారు. ఇక, కేంద్రం వరి ధాన్యాన్ని కొనాలని వచ్చే శుక్రవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు.. ధర్నాలకు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.. వడ్లు కొంటవా? కొనవా? అనేది తేలిపోవాలని అన్నారు.. ఇక, వరి కొనగోళ్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. శుక్రవారం జరిగే ధర్నాలో మాతో కలిసి నువ్వు కూడా కూర్చుంటావా? అంటూ బండి సంజయ్‌కి సవాల్ చేశారు కేసీఆర్.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్.. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? లేదా ? అని నిలదీసిన ఆయన.. సమాధానం చెప్పే వరకు బీజేపీ నేతలని వదిలిపెట్ట౦ అని హెచ్చరించారు.. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం.. మా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం అన్నారు.. మీ తాత జేజమ్మ ఎవరున్నా వదిలిపెట్టం. ఈ దేశ ఖజానాలో మా వాటా ఉందన్నారు కేసీఆర్.. ఈ దేశం మీ అయ్య సొత్తు కాదు.. మిమ్మల్ని వదలం, వేటాడుతాం.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వరకు పోరాడుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్.
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!