TRS, BJP pota contest flexes in Medak: మెదక్ రైల్వేస్టేషన్ నుంచి కాచిగూడ వరకు రైలు పరుగులు పెట్టనుంది. ఈనేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు జెండా ఊపి ఈ ప్యాసింజర్ రైలును ప్రారంభించనున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్ హాజరుకానున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు హాజరు కానున్న నేపథ్యంలో.. పోటీపోటీగా ఫ్లె్క్సీలు ఏర్పాటు చేశారు ఇరువర్గాల శ్రేణులు. మెదక్ కి రానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానిస్తూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాగా.. మెదక్ కి ట్రైన్ తెచ్చిన సీఎం కి కృతజ్ఞతలు అంటూ TRS ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఈ ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఫోటోలతో పెద్ద ఎత్తున ప్లెక్సీలు TRS నేతలు ఏర్పాటు చేసారు. దీంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏంజరగనుందో అంటూ సర్వత్రా ఉత్కంఠంగా మారనుంది. అయితే పోలీసులు అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మెదక్‌కు రైలు మార్గం కోసం 2003లో రైల్వే సాధన సమితి పేరిట స్థానిక ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు. కాగా.. ఈ క్రమంలో 2012-13 రైల్వే బడ్జెల్లో కాస్ట్ షేరింగ్ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ వరకు బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ మంజూరైంది. అనంతరం కేంద్ర ప్రభుత్వ వాటా నిధులన్నీ మంజూరవగా, రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెండింగ్‌లో ఉండడంతో పనులు నత్తనడకన సాగాయి. గత డిసెంబరులో రూ.20 కోట్లు మంజూరవడంతో ఆ మేరకు పనులు జరిగాయి. మెదక్ రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. అంతేకాకుండా.. ఈ స్టేషన్ నుంచి నిత్యం తెల్లవారుజామున 5 గంటలకు కాచిగూడ ప్యాసింజర్ రైలు బయలుదేరుతుంది. నేడు మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభం సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రజలంతా ఉదయం 11 గంటలకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని రైల్వే సాధన సమితి ఓ ప్రకటనలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Kakani Govardhan Reddy : చంద్రబాబుకి సిగ్గు, శరం వంటివి ఏమీ లేవు