Tragedy in nirmal: తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలను బలిగొంది. తేనెటీగల గుంపు తనపైకి వస్తున్నా ఆలోచించకుండా బావిలోకి దూకాడు. కానీ తనకు ఈత రాదని మర్చిపోయాడు. యువకుడు బావిలోకి దూకడం ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలంలో చోటుచేసుకుంది.
సోన్ మండలం సాకెర గ్రామంలో 27 ఏళ్ల కల్లెడపు నర్సయ్య నివసిస్తున్నాడు. అయితే సోమవారం గ్రామంలో భీమన్న పండుగను గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగా గ్రామంలోని ప్రజలంతా డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గుడి పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది. తేనెటీగలు దాని మీదికి వచ్చాయి. అయితే గ్రామస్తులంతా డప్పు చప్పుళ్లతో తిరుగుతుండగా ఒక్కసారిగా తేనెటీగల గుంపు లేచింది. గుడి చుట్టుపక్కల, మర్రిచెట్టు కింద ఉన్న వారిపై దాడికి దిగారు. దీంతో వారంతా తమ వైపు పరుగులు తీశారు.
ఈ క్రమంలో కల్లెడపు నర్సయ్య కూడా వ్యవసాయ క్షేత్రం వైపు పరుగులు తీశాడు. అలా పరిగెత్తుతుండగా తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు గొలుసుకట్టు బావిలో దూకాడు. అతన్ని ఎవరూ గమనించలేదు. అయితే ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు పండుగ వాతావరణంతో ఆనందంగా ఉన్న జనం ఒక్క సారిగా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. నర్సయ్య మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. కొడుకును బావిలో దూకినప్పుడు ఎవరైనా గమనించి ఉంటే తన కుమారుడు బతికే వుండేవాడని కన్నీరుమున్నీరయ్యారు.
Deepthi Sunaina: పోర్న్ స్టార్ తో పోలుస్తూ దీప్తి సునైనా పరువు తీస్తున్ననెటిజన్లు..