ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోతోంది. ఇండియన్2 వల్ల గేమ్ చేంజర్ డిలే అవుతోంది. అసలు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందనే విషయంలో క్లారిటీ లేకుండాపోయింది. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే సమ్మర్‌లో గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుందని అనుకున్నారు కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే.. గేమ్ చేంజర్ థియేటర్లోకి రావాలంటే మరో ఏడాది వెయిట్ చేయాల్సింది.
ఇంకా సెట్స్ పైకి వెళ్లనే లేదు.. ఆర్సీ 16 రిలీజ్ డేట్ పై సాలిడ్ బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు. దీపావళి తర్వాత ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి.. డిసెంబర్ లేదా జనవరిలో రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారట. అలాగే 2025 సంక్రాంతి టార్గెట్‌గా ఆర్సీ 16ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఆరు నెలల గ్యాప్‌లో చరణ్ నుంచి రెండు భారీ ప్రాజెక్ట్స్ థియేటర్లోకి రానుందని చెప్పొచ్చు. ఇకపోతే… ఇప్పటికే ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు బుచ్చిబాబు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయిపోయాడు. అలాగే ఇద్దరు హీరోయిన్లు కూడా లాక్ అయినట్టు సమాచారం. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది. మరి గేమ్ చేంజర్, ఆర్సీ 16 ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.