ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ ఎక్కువయ్యాయి. గతంలో టిక్ టాక్ వీడియోలు హల్ చల్ చేసేవి. పాములతో, ఇతర వన్యప్రాణులతో సెల్ఫీలు దిగేవారు. అందులో కొందరికి అది వినోదంగా మారితే.. విష సర్పాల బారిన పడి ప్రాణాలు వదలడంతో ఆయా కుటుంబాలకు విషాదంగా మారేవి. తాజాగా ఓ ఆటో వాలా చేసిన పనికి బిగ్ షాకిచ్చారు ట్రాఫిక్ పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు ఆటోపై వివిధ విన్యాసాలు చేస్తూ
సందడి చేశాడు. రోడ్డుపై వెళుతున్న ఆటో పైన నిలబడి రీల్స్ చేశాడు. అంతవరకూ బాగానే వుంది. మన ట్రాఫిక్ బాబాయిలు ఊరుకుంటారా. ట్రిపుల్ రైడింగ్, నో హెల్మెట్ వంటి వాటికే చలానాలు వేసి ముక్కు పిండి వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటిది ఇలాంటి విచిత్ర విన్యాసాలు యువకుడిని వదిలిపెడతారా?
నారాయణఖేడ్ లో ఆటో పై నిల్చొని రీల్స్ చేసిన యువకుడి గూబ గుయ్యిమనిపించారు. తన విన్యాసాలను పుష్ప తరహాలో తగ్గేదేలే అంటూ వీడియో తీశాడా యువకుడు. మేము కూడా తగ్గేదేలే అంటూ 1635 రూపాయలు ఆటోకి ఫైన్ వేశారు పోలీసులు. అందులో డేంజరస్ డ్రైవింగ్ కి ఫైన్ కింద వెయ్యి రూపాయలు, నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.500 ఫైన్ వేశారు. అంతేకాదండోయ్ రూప్ ట్రావెలింగ్ చేసినందుకు మరో 100 వడ్డించారు పోలీస్ బాబాయిలు. వీటికి తోడు 35 రూపాయలు సర్వీస్ ఛార్జి.. వెరశి అతని చేష్టలకు మొత్తం జరిమానా అక్షరాలా రూ.1635 రూపాయలు వేశారు. ఈ జరిమానాను కూడా అతను రీల్స్ చేసి చూపిస్తాడేమో.. ద్యావుడా..
Snakes Dance: సంగారెడ్డిలో పాముల సయ్యాట