ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా.. సీఎం ముందే వీహెచ్, అంజన్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. వీహెచ్ తన ప్రసంగంలో యాదవుల ప్రస్తావన చేయలేదని అంజన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమను తొక్కేస్తున్నారని అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యులుగా మేమంతా ఆరోజు పోరాడాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. నిరుద్యోగ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ఒకే కులానికి మంత్రి పదవులు ఉన్నాయని, ఇతర కులాలకు పనికిరాని పదవులు ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు..ఉద్యోగాలు అక్కడ లేవు..ఇక్కడ లేవు.. ఉద్యోగాలు వచ్చే వరకు…