“బిట్రా ద్వీపం”లో మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. నేరుగా పాక్, చైనాలపై గురి..
భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
“చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబు దిట్ట”.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
చంద్రబాబును మించిన క్రిమినల్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరూ లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అంతటి దివాళాకోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరన్నారు. మద్యం కేసులో ఎంతమందిని అరెస్టు చేసినా లెక్క చేయమని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీని అణచి వేయలేరన్నారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలకు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. అలాంటి వారికే ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలకు జనం విస్తుపోతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తారని ప్రజలు కూటమిని గెలిపించారు.. కానీ రాజకీయ కక్షసాధింపులు, వైసీపి నేతలు, కార్యకర్తలను వేధించే పని చేస్తున్నారని మండిపడ్డారు.
నది నుంచి చెప్పులు తీయడానికి ప్రయత్నించి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
మధ్యప్రదేశ్ సియోని జిల్లాలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. నదిలో నుంచి చెప్పులు తీసేందుకు ప్రయత్నించిన 20 ఏళ్ల వ్యక్తి, అందులో జారిపడి కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు చూస్తుండగానే నీటిలో మునిగిపోయాడు. సరదాగా పిక్నిక్ వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాధిత యువకుడిని ఆయుష్‌గా గుర్తించారు. ఆయుష్ అతడి స్నేహితులతో కలిసి పరేవా ఖో అనే ప్రసిద్ధ ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు. ఆసమయంలో నదిలో అతడి చెప్పు కొట్టుకుపోయింది. దీనిని తిరిగి తీసే క్రమంలో ఆయుష్, ఒక కర్రను ఉపయోగించి నీటిలోకి అడుగు పెట్టాడు. కొట్టుకుపోతున్న చెప్పును కర్రతో ఆపాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను జారిపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయి నదిలో పడిపోయాడు. మరుసటి రోజు రెస్క్యూ టీం ఆయుష్ మృతదేహాన్ని తెలికి తీసింది.
“లిక్కర్ స్కాంలో జగన్ అరెస్ట్ అవుతారు”.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
మద్యం స్కాంలో త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతారని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగన్ పాత్రపై కూడా విచారణ జరపాలన్నారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్‌లో విజయ సాయి రెడ్డి వాటాలు తేలక బయటపడ్డారని ఆరోపించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్‌లో ముఖ్య భూమిక వహించారని ఆరోపించారు. క్యాబినెట్‌లో మద్యం పాలసీని ఆమోదించిన వారందరినీ విచారణ చేయాలని ప్రభుత్వానికి కోరనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి రిమాండ్ విధించింది. ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి జైలుకి తరలించనున్నారు. అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధరించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు. మిథున్‌రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్‌విత్ 34, 37, ప్రివెన్షన్ ఆప్ కరెప్షన్ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.
“ఇదే టీడీపీ అసలు ఎజెండా”.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ ఫైర్..
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు.. రాజకీయ కుట్రలలో భాగంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని తప్పుడు పద్దతిలో ఇరికించారన్నారు. ఇది కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన రాజకీయ ప్రతీకార చర్య..లిక్కర్ స్కాం కేవలం మీడియాను, ప్రజలను నిజమైన సమస్యల నుండి దృష్టి మరల్చడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు.. కేసు మొత్తం ఒత్తిడి, బెదిరింపులు, థర్డ్-డిగ్రీ, హింస, లంచాలు మరియు ప్రలోభాల తోనే కేసును ముందుకు నడుపుతున్నారు.. 2014 – 19 కాలంలో మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉన్నాడనేది వాస్తవమని జగన్ అన్నారు.. ఆయన దిగజారిపోయాడు రాజకీయాలకు ఇది నిదర్శనమని.. 2014-19 కాలంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును కొట్టివేయాలని.. 2024-29కి తన విధానాన్ని సమర్థించుకోవాలని ఆయన వైసీపీ ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని తప్పుబడుతున్నారన్నారు. ఓవైపు వైసీపీ నాయకులపై మద్యం కుంభకోణం ఆరోపణలు చేస్తూనే.. కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అవినీతి మద్యం పద్ధతులను తిరిగి పునరుద్ధరిస్తోందని తెలిపారు.
వరంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వరాలు కురిపించారు. వరంగల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మాణం, స్పోర్ట్స్ స్కూల్ స్థాపనకు ఆమోదం తెలిపి సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేపూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ అభివృద్ధి అంశాలపై కలిశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం ఏర్పాటు వంటి డిమాండ్లను సీఎం వెంటనే ఆమోదించారు. ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవడంతో వరంగల్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు నగర క్రీడాభివృద్ధికి దోహదం చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
అలా చేస్తే చట్టపరమైన చర్యలు.. వాళ్లకు ‘మైత్రీ’ వార్నింగ్..
బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. వాళ్లు పవన్ కల్యాణ్ తో నిర్మిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా గ్యాప్ తర్వాత షూట్ రీ స్టార్ట్ చేశారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అఫీషియల్ గా ప్రకటించక ముందే.. చాలా పిక్స్, షూటింగ్ అప్డేట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో మైత్రీ సంస్థ తాజాగా దీనిపై రియాక్ట్ అయింది. మేం ఈ నడుమ కొన్ని పోస్టులు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సోషల్ మీడియాలో చూస్తున్నాం. మీ ఉత్సాహం మాకు అర్థమైంది. మేం ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి.
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ ఉద్రిక్తత.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు..
రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ నెలకొంది. సిట్ అధికారులు కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకురానున్నారు. దీంతో సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు సైతం భారీగా తరలివచ్చారు. జైలు గేటుకు కొంత దూరంలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన కార్యకర్తలందరినీ అక్కడే నిలువరించారు. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచగా.. కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. ఆగస్ట్ ఒకటో తేదీ వరకూ మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన మంత్రి.. వీడియో వైరల్..
మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకటే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మొబైల్‌లో రమ్మీ ఆడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వివాదం మొదలైంది. ఈ సంఘటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. శివసేన కూడా మాణిక్‌రావ్ కోకటే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రోహిత్ పవార్ దీనిపై స్పందించారు. ఈ సంఘటన మహారాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుందని అన్నారు. వ్యవసాయ మంత్రి మొబైల్‌లో బిజీగా ఉండగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సభలో ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
మా ఆలయాలకు నిధులెందుకు మనమెందుకు అడుక్కోవాలి.?
‘పన్నులు కట్టేది మనం. బిల్లులు కట్టేది మనం…సర్కారుకు ఖజానా చేకూర్చేది మనం. మరి మన ఆలయాల కోసం, బోనాల కోసం పైసలియ్యాలంటూ ప్రతి ఏటా బిచ్చమెత్తుకునే దుస్థితి మనకెందుకు?’’అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరినీ యాచించే అవసరమే లేకుండా బోనాల ఉత్సవాలతోపాటు హిందువుల పండుగలన్నింటికీ నిధులు కేటాయించి ప్రతి ఒక్క హిందువు గర్వించేలా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. టెర్రరిస్టుల బాంబు పేళుల్లు, జిహాదీ గ్యాంగులతో ఇల్లు వాకిలి వదిలివెళ్లిన పాతబస్తీ ప్రజలంతా తిరిగి తమ సొంత ఇండ్లకు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ‘‘పాతబస్తీ వాసులారా… మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా…. సింహవాహిని అమ్మవారి సాక్షిగా, భాగ్యలక్ష్మీ పాదాల సాక్షిగా మీకు అండగా నేనున్నా…పాతబస్తీ మీది. మీకే భయం అక్కర్లేదు. మీ ఇంటికి మీరు రండి. మిమ్ముల్ని రక్షించే బాధ్యత మేం తీసుకుంటాం. హిందువులందరినీ ఓటు బ్యాంకుగా మార్చి హిందువుల సత్తా చాటుతాం.’’అంటూ భరోసా ఇచ్చారు.
