షాకింగ్ మర్డర్స్.. భార్య, ప్రియుడి తలలు నరికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త!
తమిళనాడు రాష్ట్రంలో సంచలన సంఘఠన చోటు చేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా మలైకొట్టాళం గ్రామానికి చెందిన కొళంజి అనే వ్యక్తి తన భార్య గీతాతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, ఈ మధ్య భార్య గీతాకు అదే గ్రామానికి చెందిన తంగరసు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం కొళంజి తన ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా భార్య గీతా, ప్రియుడు తంగరసును ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దింతో ఆగ్రహానికి లోనైనా కొళంజి కత్తితో వారి ఇద్దరిపై రెచ్చిపోయాడు.
అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ఏ రోజున ఏ అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారంటే!
దసరా పండగను అనుసరించి జరగబోయే నవరాత్రులకు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈ శరన్నవరాత్రులు కొనసాగునున్నాయి. ప్రతి ఏడాది పది అలంకారాలు జరుగుతూ వస్తున్నా.. ఈసారి మాత్రం అమ్మవారు 11 అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నట్లు సమాచారం. బాలత్రిపుర సుందరి నుంచి రాజేశ్వరి దేవి వరకు 11 రోజులు 11 అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
చార్లీ కిర్క్ హత్య కేసు నిందితుడి ఫొటో విడుదల.. వయస్సు ఎంతంటే ..!
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ (31) హత్య అమెరికాను కుదిపేసింది. ట్రంప్‌కు అత్యంత దగ్గర మనిషిగా పేరుగాంచిన చార్లీ కిర్క్ హత్యకు గురి కావడంతో అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక్క తూటాకే సంఘటనాస్థలిలో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. పేలుడు శబ్దానికి గందరగోళం చెలరేగడంతో ప్రేక్షకులంతా తలోవైపు పారిపోయారు. ఇక కేసును ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే చార్లీ కిర్క్‌పై కాల్పులు జరగగానే గందరగోళం చెలరేగింది. దీంతో నిందితుడు కూడా చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. అయితే తాజాగా నిందితుడికి సంబంధించిన ఫొటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. కాలేజీ వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఫొటోల్లో నిందితుడు చాలా చిన్నవాడుగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిందితుడిని ఇంకా పోలీసులు పట్టుకోలేదు. ప్రస్తుతం నిందితుడికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే హంతకుడు ఉపయోగించిన రైఫిల్‌ను మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు గురువారం ఎఫ్‌బీఐ తెలిపింది. శక్తివంతమైన రైఫిల్‌గా గుర్తించారు. అందుకే ఒక్క తూటాకే చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం.. ఎన్డీఏ నేతల హాజరు
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్(67). తమిళనాడు వాసి. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన్ను ఎన్డీఏ ప్రభుత్వం ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ విజయం సాధించారు. దీంతో ఆయన 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్డీఏ నేతలంతా పాల్గొననున్నారు.
సద్గురు డీప్‌ఫేక్ వీడియోతో మహిళ నుండి రూ.3.75 కోట్లు స్వాహా చేసిన స్కామర్లు!
రోజురోజుకి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళను రూ. 3.75 కోట్లకు పైగా మోసం చేశారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు పేరుతో ఉన్న డీప్‌ఫేక్ వీడియోను నమ్మడమే ఈ మోసానికి కారణమైంది. ఈ ఘటన బెంగుళూరులోని సీవీ రామన్ నగర్లో జరిగింది. బాధితురాలు వర్ష గుప్తా ఫిబ్రవరి 25న తన యూట్యూబ్ ఛానెల్ చూస్తుండగా, సద్గురు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఒక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియో ఆమె కంటపడింది. ఆ వీడియోలో, సద్గురు కేవలం 250 అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు పొందవచ్చని చెబుతున్నట్టుగా ఉంది. డీప్‌ఫేక్ టెక్నాలజీ గురించి తెలియని వర్ష, ఆ వీడియోను నిజమని నమ్మి దాని కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసింది.
నిండుకుండలా జంట జలాశయాలు..
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తింది. దీంతో ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం (ఫుల్ ట్యాంక్ లెవెల్) 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.30 అడుగుల వరకు చేరింది. జలాశయానికి గంట గంటకూ వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, అధికారులు నాలుగు గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 1352 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పిడుగుపడి వందకు పైగా గొర్రెలు మృత్యువాత..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు భయాందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో లెంకలగడ్డ గోదావరి సమీపంలో పిడుగు పడి వందకు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పలిమెల మండలంలోని అంబట్పల్లి గ్రామానికి చెందిన ఐదుగురు గొర్రెల కాపరులు తమ గొర్రెల మందను మేత కోసం లెంకలగడ్డ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ గొర్రెలను కట్టేసి కాపరులు భోజనం చేసేందుకు తమ గ్రామానికి తిరిగి వచ్చారు. ఇదే సమయంలో వర్షం ఉరుములతో ముసురుకొని, పిడుగు గోదావరి తీరంలో పడింది. దాంతో గొర్రెల మందలో కల్లోలం చోటుచేసుకొని, వందకు పైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మళ్లీ తిరిగి వెళ్లి చూసేసరికి తమ గొర్రెలు చనిపోయిన దృశ్యం కాపరులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒకేసారి వందకు పైగా గొర్రెలను కోల్పోవడం తమకు తట్టుకోలేని నష్టం అని వారు వేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన.. పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇకపై పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ చేశారు. ఖతార్‌లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలు ఇలా నడుస్తుండగానే రెండు రోజుల గ్యాప్‌లో వెస్ట్ బ్యాంక్‌లోని మాలే అడుమిమ్ సెటిల్మెంట్ ప్రాంతాన్ని నెతన్యాహు సందర్శించారు. ఇకపై ఈ భూభాగం తమదేనని ప్రకటించారు. ఇక్కడ వేలాది కొత్త గృహాలు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ వివాదాస్పద E1 సెటిల్మెంట్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే ఒప్పందంపై నెతన్యాహు సంతకం కూడా చేశారు. దీంతో ఇక పాలస్తీనా రాజ్యం ఉండదని ప్రపంచానికి సంకేతం ఇచ్చారు. జెరూసలేం తూర్పున ఉన్న ప్రాంతంలో వేలాది కొత్త గృహాల నిర్మాణం కోసం చేపట్టిన E1 ప్రణాళికకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికా సంఘం నుంచి కూడా తుది ఆమోదం లభించేసింది.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అల్ప పీడనం ఏర్పడే అవకాశం!
తెలుగు రాష్ట్రాలకు మరోసారి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇందులో భాగంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్ప పీడనం ఏర్పడే అవకాశం వుంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో ఇప్పటికే దుకు వాతావరణం అనుకూలంగా మారింది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పశ్చిమ గోదా వరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోన సీమ, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.