హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ టోనీ తో సంభందాలు పెట్టుకున్నారని ఇప్పటికే వారిని అరెస్ట్ చేశారు. అయితే జైలులో ఉన్న డ్రగ్ పెడ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు 5 రోజులు కస్టడీ కి తీసుకోని విచారిస్తున్నారు. అయితే.. డ్రగ్స్ కేసులో టోనీ ఐదురోజుల కస్టడీ ముగిసింది. దేంతో నేడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుండి టోనీని పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. 5 వ రోజు కస్టడీ లో కీలక అంశాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. సుమారు 8 గంటల పాటు టోనీని, టోనీ అనుచరులను టాస్క్ఫోర్స్ డీసీపీ రాధకిషన్ తో పాటు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ లు విచారించి కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.
ఐదు రోజుల పాటు టోనీని సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. టోనీతో సంబంధాలు ఉన్న పలువురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. టోనీ కి వ్యాపార వేత్తలకు ఏజెంట్లు గా ఉన్న10 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. టోని వద్ద వివిధ రంగాలకు చెందిన పలువురు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. టోనీతో డ్రగ్స్ లావాదేవీలు జరిపిన పరారీలో ఉన్న పలువురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. టోనీ కాల్ డేటా, డార్క్ నెట్ వెబ్ సైట్, ఇంటర్నెట్ కాల్స్ కూడా పోలీసులు పరిశీలించారు.