Telangana Rains: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..
- తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు సాధారణ వర్షాలే..
- తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలు..
- పలు జిల్లాల్లో 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు..
- రాష్ట్రంలో తీవ్రమైన ఉక్కపోత- వేడిమి వాతావరణం..
- వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలు ఉంటాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రాష్ట్రంలో తీవ్రమైన ఉక్కపోత.. వేడిమి వాతావరణం ఉంటుందని తెలిపింది. వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినా ఒక్క చోటే కురవడం మరో చోట వర్షం కురవకపోవడం ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బుదులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురుస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read also: SDGM: బాలీవుడ్ హీరోతో గోపీచంద్ మలినేని సినిమా.. జూన్ 22 నుంచి షూటింగ్!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇప్పటికే పలువురు రైతులు వరిసాగు చేశారు. కానీ వర్షం కురిస్తేనే మొక్కలు నాటే అవకాశం ఉంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఇండో-జర్మన్ నిపుణులు కూడా తెలంగాణ వాతావరణాన్ని పరిశోధించారు. వారి అంచనా ప్రకారం తెలంగాణలో జూన్ 21, 22 తేదీల్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించగా.. జూన్ 21న తూర్పు తెలంగాణ, 22న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు ప్రకటించారు.
Read also: Big Breaking: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
ఈసారి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇండో-జర్మన్ నిపుణుల బృందం దేశంలో రుతుపవనాల ప్రవేశాన్ని, వాటి వల్ల కురిసే వర్షపాతాన్ని అధ్యయనం చేసింది. దాదాపు పదేళ్లపాటు పరిశోధనలు చేసి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో మారుతున్న వాతావరణ పరిస్థితులను వివరించారు. మరోవైపు సూపర్ నినో క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2023 జూన్‌లో ప్రారంభమైన ‘ఎల్‌నినో’ ప్రభావం మే 2024 వరకు గత సంవత్సరంలో ప్రపంచ దేశాలకు ఎన్నడూ చూడని వేడిని పరిచయం చేసిందని వివరించింది. ప్రస్తుతం పరిస్థితి తటస్థంగా ఉంది. ఎల్‌నినో వస్తే ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
Air Pollution: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. రోజూ 2 వేల మంది చిన్నారుల బలి!
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..