Tirupati Reddy: హాట్ కేక్‌లా మెదక్ అసెంబ్లీ టిక్కెట్.. కాంగ్రెస్ పార్టీకి తిరుపతి రెడ్డి రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్‌ను తిరుపతిరెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్‌కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండటంతో కాంతారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
మైనంపల్లి హన్మంతరావు గత వారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 28న న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. మల్కాజిగిరి నుంచి మైననంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి హన్మంతరావు కుమారుడు రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. మైనంపల్లి హన్మంతరావు 2009-2014 వరకు మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రోహిత్ కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ నుంచి బీఆర్‌ఎస్ టికెట్ తన కుమారుడు రోహిత్‌కు ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని కోరారు. కానీ, బీఆర్‌ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
దీంతో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంతరావు విమర్శలు గుప్పించారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అయితే మైనంపల్లి హన్మంతరావు కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని తేలడంతో తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌ను వీడారు. డబ్బు మూటలు ఇచ్చిన వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తారా లేక కర్ణాటక మాదిరి కాదా అని ప్రశ్నించారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా డబ్బున్న వారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పార్టీ అభ్యర్థిగా మొదట హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు వేరొకరికి టికెట్ కేటాయించడంపై తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
Tiger Nageswara Rao: ‘హేమ లత లవణం’గా రేణు దేశాయ్…
తాజావార్తలు
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!