తెలంగాణలో రానున్న మరో మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.. రేపు,ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.. ఇక, రాగల మూడు రోజుల పాటు.. ఇవాళ, రేపు, ఎల్లుండి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడుతుందని.. ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది హైదరాబాద్ వాతావరణశాఖ.