School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. మూడురోజులు విద్యా సంస్థలకు సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holidays: మూడురోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మూడు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. పిల్లలు వర్షానికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల తరువాత వర్షాలు ఎక్కవ పడితే వాటి పరంగా స్కూళ్లకు సెలవు ప్రకటించాలా? లేదా అనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, బయలకు పంపవద్దని సూచించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ఉదయం పాఠశాలలు, కార్యాలయాలకు బయల్దేరిన వారి వాహనాలతో రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మూడురోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Read also: Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
Also Read
భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరికొద్ది గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తలసాని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్‌కో ఎండీలతో మాట్లాడారు. రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేస్తున్నందున మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం, GHMC హెల్ప్‌లైన్ నంబర్ 040-2111 1111, డయల్ 100, EVDM కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667 ను సంప్రదించాలని సూచించారు.
Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!