మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ మహేష్ విట్టా పేరు అందరికి తెలుసు.. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు చేశాడు.. ఫన్ బకెట్ ద్వారా పరిచయం అయ్యి సినిమాలలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. చిత్తూర్ స్లాంగ్ లో అతను పలికే డైలాగులు అందరినీ నవ్వించాయి. అందువల్ల అతనికి నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో అవకాశం లభించింది. అటు తర్వాత ‘శమంతకమణి’ ‘టాక్సీ వాలా’ ‘నిను వీడని నీడను నేను’ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ‘ఛలో’ ‘యురేక’ ‘కొండపొలం’ ‘అల్లుడు అదుర్స్’ ‘సకల గుణాభిరామ’ వంటి సినిమాల్లో నటించాడు మహేష్..
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా విచ్చేసి దాదాపు 60 రోజుల వరకు హౌస్ లో ఉన్నాడు.’పుష్ప’ సినిమాలో కేశవ పాత్ర మొదట ఇతనికే లభించింది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మిస్ చేసుకున్నాడు మహేష్. ఇదిలా ఉండగా.. మహేష్ ఇటీవల సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.. ఈ నెల 2వ తేదీన శ్రావణి అనే అమ్మాయితో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వీరిద్దరి వివాహం జరిగింది..
కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరులోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో మహేష్ – శ్రావణి ల వివాహం తమ బంధుమిత్రుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. శ్రావణి .. మహేష్ చెల్లెలి ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఆ రకంగా వీరి మధ్య పరిచయం ఏర్పడటం.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి పెళ్లిచేసుకున్నారు.. అయితే ఈ పెళ్లికి సినీ ప్రముఖులు ఎవరు హాజరైనట్లు లేదు.. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.. వీరిద్దరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక మహేష్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో చేస్తున్నాడు..