RS Praveen kumar: బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా కానీ.. బీజేపీకి ఎప్పటికీ మద్దతివ్వబోమని తేల్చి చెప్పారు. ఒకే దేశం-ఒకే మతం అంటూ బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయని అన్నారు. ఇప్పటికే గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అనేక హామీలు గుప్పిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ టార్గెట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎత్తుగడలు వేస్తున్నారు.
Read also: NTR centenary celebrations: ఎమ్మెల్యేను బుల్లెట్ ఎక్కించుకున్న మాజీ మంత్రి
తాజాగా హైదరాబాద్‌లో బీఎస్పీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాజరయ్యారు. ఈ సభలో బీఎస్పీ తరపున తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రకటించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ పుంజుకుంది. గత ఎన్నికల్లో కూడా బీఎస్పీ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఎస్పీ నాలుగు వేలకు పైగా ఓట్లను సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు బీఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజా వ్యాఖ్యలతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ ఎవరికి మద్దతు ఇస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Lakshmi Parvathi: ఎన్టీఆర్ నిజమైన వారసుడు ఆయనే.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు