Lakshmi Parvathi: ఎన్టీఆర్ నిజమైన వారసుడు ఆయనే.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmi Parvathi: స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి.. వైసీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ నిర్వహించారు.. ముఖ్య అతిథులుగా సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి హాజరుకాగా.. మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను కష్టకాలంలో అండగా నిలబడిన దేవినేని నెహ్రూ నిజమైన వారసుడు అని తెలిపారు.. ఇక, ఇంత అద్భుతంగా ఎన్టీఆర్ కార్యక్రమం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదన్న ఆమె.. అప్పట్లో నా గొంతు వినిపించకుండా మీడియా అడ్డుకుంది.. జగన్ వల్ల నా గొంతును ఇంత మంది వింటున్నారు.. ఈ శతాబ్ది ఎన్టీఆర్ ది అని పేర్కొన్నారు.
నోటి మాట రాని లోకేష్ కూడా వారసుడిని అంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్న వాళ్ళు వారసులు ఎలా అవుతారు? అని ప్రశ్నించిన ఆమె.. సొంత మనుషులే వెన్నుపోటు పొడవటంతో ఎన్టీఆర్ ఎంతో ఆవేదన చెందారు.. మోసం చేసిన చంద్రబాబును అండమాన్ జైలుకు పంపిస్తానని ఎన్టీఆర్ తీర్మానం చేశారు.. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ఆశయాలను మట్టిలో కలిపేశాడు చంద్రబాబు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను కష్టకాలంలో అండగా నిలబడిన దేవినేని నెహ్రూ నిజమైన వారసుడన్న ఆమె.. ఇక, సంబంధం లేకపోయినా గౌరవంతో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు అంటూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు.. ఒక సామాజిక వివక్ష నుంచి కాపాడి నా గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ అన్న ఆమె.. ఆర్జీవీ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు..
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!