CM KCR: తెలంగాణలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడేలు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దశాబ్ది వేడుకలు సందర్భంగా.. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ప్రగతి భవన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తుందన్నారు.
జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నదన్నారు. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
Also Read
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
- Night Bus Services: హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ లో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రం హర్ ఘర్ జల్ యోజన పథకం నూటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. స్వచ్ఛ మైన తాగు నీరు అందించడంలో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడవ స్థానంలో ఉందన్నారు. 80 శాతం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తంయ్యిందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పైగా పూర్తయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో సీత రామ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకుందని తెలిపారు. త్వరలో ప్రాజెక్టు పూర్తి అవుతుందని సీఎం అన్నారు. రైతు బంధు పథకం వారి కళ్లను సైతం తెరిపించిందని చురకలంటించారు. రైతు బంధు పథకం కేంద్ర పాలకుల కళ్లను సైతం తెరిపించిందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం రైతు బంధు పథకంను అనుసరించక తప్పలేదని సీఎం తెలిపారు.
Nomophobia : నోమోఫోబియా.. ప్రతి నలుగురిలో ముగ్గురికి..
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!