Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yeshanagula Song: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ‘ఏషనాగుల’ విడుదలైంది. ఈ పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగా.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన మాస్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా.. ‘ఏషనాగుల’ పాట థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఒక్క విషయం మాత్రం గ్యారెంటీ అని శ్రీకాంత్ ఓదెల పేర్కొన్నారు. సినిమా విడుదలైనప్పుడు థియేటర్లు లైవ్ కచేరీలుగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ది ప్యారడైజ్’లో ‘ఏషనాగుల’ పాటకు అంతటి ఎనర్జీ ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. ఈ పాట తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమని దర్శకుడు వెల్లడించారు. తాను స్కూల్లో చదువుకునే సమయంలో ఈ పాటను విన్నానని, అప్పటి నుంచి అది తనతోనే ఉండిపోయిందని చెప్పారు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ కోసం సరైన సందర్భం దొరకడంతో ఆ పాటను సినిమాలో ఉపయోగించానని వెల్లడించారు.
‘ఏషనాగుల’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ అధికారింగా విడుదల చేశారు. పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో చిత్రబృందం కూడా మంచి జోష్‌లో ఉంది. ముఖ్యంగా పాటలోని జానపద నేటివిటీ, మాస్ బీట్, ఎనర్జిటిక్ ట్యూన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నాని మరోసారి డిఫరెంట్ మాస్ అవతార్‌లో కనిపించనున్న ఈ సినిమాపై సినిమా ప్రేమికులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ‘ది ప్యారడైజ్’ను ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి శ్రీకాంత్ ఓదెల చెప్పినట్లుగా ‘ఏషనాగుల’ పాట థియేటర్లను నిజంగానే లైవ్ కచేరీలుగా మారుస్తుందా? తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Also Read
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!