Night Bus Services: హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో ప్రయాణించే పౌరులు, ఐటీ ఉద్యోగులు , నైట్ షిఫ్ట్ సిబ్బంది సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి నగరంలోని 6 ప్రధాన రూట్లలో నైట్ బస్ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద ఈ నైట్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుండటం విశేషం.
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు ఆలస్యంగా చేరుకునే దూరప్రాంత ప్రయాణికులతో పాటు హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఐటీ కారిడార్లలో రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతి 30 నిమిషాల నుంచి గంటకు ఒక బస్సు చొప్పున సర్వీసులను నడపనున్నారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
నైట్ బస్ రూట్లు, సర్వీసుల వివరాలు ఇలా..
బస్సు నంబర్ 10H (సికింద్రాబాద్ ↔ కొండాపూర్): సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ మీదుగా కొండాపూర్ వరకు ఈ బస్సులు తిరుగుతాయి. రాత్రి వేళల్లో ప్రతి 30 నిమిషాల నుంచి గంటకు ఒక సర్వీస్ చొప్పున మొత్తం 8 నుంచి 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
బస్సు నంబర్ 195W (బాచుపల్లి ↔ వేవ్‌రాక్): బాచుపల్లి నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి మీదుగా వేవ్‌రాక్ వరకు నడిచే ఈ బస్సు ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గంటకు ఒక సర్వీస్ నడుస్తుంది.
బస్సు నంబర్ 290U (సికింద్రాబాద్ ↔ హయత్‌నగర్): రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఎదురుగా ప్రారంభమై ఎల్బీనగర్, వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీ మీదుగా హయత్‌నగర్ చేరుకుంటుంది.
బస్సు నంబర్ 218 (కోఠి ↔ పటాన్చెరు): కోఠి, అబిడ్స్ పరిసర ప్రాంతాల నుంచి పటాన్చెరు వరకు ఈ నైట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
బస్సు నంబర్ 222A (కోఠి ↔ పటాన్చెరు): కోఠి నుండి హైటెక్ సిటీ మీదుగా పటాన్చెరు వరకు అత్యధిక రద్దీ ఉండే ఈ రూట్లో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రతి 30 నుండి 60 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది.
బస్సు నంబర్ 219 (సికింద్రాబాద్ ↔ పటాన్చెరు): సికింద్రాబాద్ నుంచి పటాన్చెరు మార్గంలో నైట్ సర్వీస్ నిర్వహణకై అధికారులు ఇప్పటికే మార్గాన్ని పరిశీలించారు.
ఈ నైట్ సర్వీసుల వల్ల అర్ధరాత్రి వేళల్లో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి అధిక ఛార్జీలు చెల్లించే భారం ప్రయాణికులకు తగ్గనుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!