Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా..
- కీవ్‌పై మిస్సైల్ అటాక్, 27 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. కీవ్ సమీపంలోని బుచా జిల్లాలో 27 మంది మరణించారు. ఈ దాడుల్లో 50 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. దాడుల కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, పలుచోట్ల నివాసాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, తర్వాత భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే, ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుడు సామాగ్రి ఉంచారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. నివాస ప్రాంతాల్లో మందుగుండు సామాగ్రి చేయడంపై నిల్వ సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇప్పటికే 370 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరసగా మూడు రోజుల నుంచి కీవ్‌ను రష్యా టార్గెట్ చేస్తోంది. రాజధాని ప్రాంతంపై రష్యా నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. దీంతో నగరంలో జనజీవితం అస్తవ్యస్తమైంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రష్యా, ఉక్రెయిన్‌లో ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు భారీ దాడులకు పాల్పడుతున్నారు. దీంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమై నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ, ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!