Telangana VCs: తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం నేటితో ముగియనుంది. కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ఇన్ చార్జి వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీల వీసీల ఎంపికకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ వీసీ పోస్టులకు మొత్తం 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకోగా, అన్ని యూనివర్సిటీల నుంచి మొత్తం 1,382 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి, వీసీల పేర్లను సిఫారసు చేసేందుకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో వీసీల నియామకంలో కొంత జాప్యం జరిగింది.
Read also: Tragedy: భార్య భర్తపై పడిన భారీ వృక్షం.. ఆ తరువాత..
ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ ఇంకా కమిటీల సమావేశాలు జరగలేదు. దీంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొద్దిరోజుల పాటు ఆయా యూనివర్సిటీలకు ఇన్ చార్జిలను నియమించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ఇన్ ఛార్జిలుగా ఐఏఎస్ అధికారులను నియమించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పదవీకాలం ముగియడంతో పలు యూనివర్సిటీల వీసీలు హడావుడిగా బిల్లులు క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా కొనసాగుతున్న వీసీల పదవీకాలం చివరి దశలో ఇలా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, జేఎన్ఏఎఫ్ఏ వంటి పలు యూనివర్సిటీలు రూ.కోట్లలో పాత బిల్లులు చెల్లించిన సంగతి తెలిసిందే.
Travelers to Goa: గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు..?