Warangal Market: అసలే పండగ సీజన్ వున్న పంటను అమ్ముకుని వచ్చిన డబ్బుతో పండుగను జరుపుకునే ఆనందంలో వున్న రైతులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే నీరు లేక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలకు చేతి కొచ్చిన పంట నేలరాలడం జరిగి రైతుల కంట కన్నీరు వస్తుంది. వీటన్నింటిని తట్టుకుని వచ్చిన పంటను అమ్ముకుంటే పండగకు అయినా వచ్చిన డబ్బుతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుదామనుకునే రైతులకు చివరకు నిరాసేమిగింది. ఎప్పుడూ.. పండుగ సీజన్ ల్లో.. రైతులు, వారు తెచ్చిన పంటలతో నిండుగా ఉండే వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనిపించనుంది.
Read also: Apple Layoff 2024: యాపిల్‌లో భారీగా ఉద్యోగాల కోత!
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. ఐదు రోజులు ఏనుమాముల మార్కెట్ బంద్ కానుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు నష్టాలు, మరో వైపు మార్కెట్లకు సెలవులు ప్రకటించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు (శుక్రవారం) బాబు జగ్జీవన్‌రాం జయంతి ఉండగా, శని, ఆదివారాలు మార్కెట్‌కు వారాంతపు సెలవులు కాగా.. అలాగే )సోమవారం) అమావాస్య, మంగళవారం ఉగాది సందర్భంగా ఏనుమాముల మార్కెట్ కు అధికారులు సెలవు ప్రకటించారు. అనగా.. శుక్రవారం నుంచి మంగళవారం వరకు రైతులు ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని ఆఫీసర్లు సూచించారు. 10వ తేదీ బుధవారం మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని తెలిపారు.
Read also: Uber Auto Charges: వామ్మో.. మరోసారి ఆటో చార్జికి ‘కోట్లు’ అడుగుతున్న ఉబర్..!
అంతే కాకుండా.. ఈ నెల 11,12, రంజాన్ పండుగ, 13, 14న శని, ఆదివారాలు వారాంతపు బంద్ అని మార్కె ట్ అధికారులు తెలిపారు. మొత్తం 9రోజులు మార్కెట్‌కు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉగాది పండుగ రానున్న సందర్భంగా.. ఎలా బతకాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రైతుల గురించి ఆలోచించాలని, ఏనుమాముల మార్కెట్ ను ఐదు రోజులు సెలవు ప్రకటిస్తే.. తీసుకువచ్చిన పంటను ఐదు రోజులు ఎలా పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తీసుకొచ్చిన పంటను అమ్మకునే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాలి.
Apple Layoff 2024: యాపిల్‌లో భారీగా ఉద్యోగాల కోత!