Jangaon BRS: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతుంది. టికెట్ లపై వార్ షురూ అయ్యింది. టికెట్ పంచాయితీతో జనగామ జిల్లా బీఆర్ ఎస్ లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. బీఆర్ఎస్ లో టికెట్ వార్ కొనసాగుతుంది. జనగామ బీఆర్ ఎస్ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. జనగామలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టికెట్ పంచాయితీపై క్యాడర్ అయోమయంలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే ఈసారీ కూడా టికెట్ ఇవ్వాలని జనగామలో ముత్తి రెడ్డి వర్గం ర్యాలీలు, పూజలు నిర్వహిస్తున్నారు. బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ సిద్ధేశ్వర స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా టికెట్ పై తీవ్ర లాబీయింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అటు కవితను,ఇటు హరీష్ రావును కలిసి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కైనా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
Read also: Hyderabad Metro: అర్థం లేని కొత్త నిబంధనలు.. ప్రయాణికులు ఇబ్బందులు
జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధిపై వివరణ ఇస్తూ కొంత మంది చేసే ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ గల రాజకీయలను ప్రోత్సహించలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. భావోద్వేగంతో.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి రాజకీయలను ప్రోత్సాహించరని ఆడియో పేరుకున్నారు. మరో వైపు ముత్తిరెడ్డి, పోచంపల్లితో ఉన్న బీఆర్ఎస్ నాయకులను పళ్ళ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరి స్వాగత ర్యాలీలో స్వాగతం పలుకుతూ పల్లాకు జై కొట్టి తమ అభిమానాన్ని చాటారు పల్లా వర్గీయులని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గం వేలేరు మండలంలోని సోడశపల్లిలో పల్లా నివాసంలో జనగామకు చెందిన ముఖ్య నాయకులతో పల్లా ప్రత్యేక సమావేశంతో పొలిటికల్ హీట్ పెరిగింది. జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య పోటీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే నియోజకవర్గాల్లో జనగామ ఒకటని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండగా.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మళ్లీ తనకే టిక్కెట్టు అంటున్నారు. ఇటీవల నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ప్రగతి భవన్ సమీపంలోని హరిత ప్లాజాలో సమావేశమయ్యారు. మరుసటి రోజు మల్లాపూర్‌లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మద్దతుదారులు ప్రదర్శన రూపంలో తరలివచ్చారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్