Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో నిత్యం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. చిరు వ్యాపారులు, విద్యార్థులు, నగరంలో ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లే ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రోకు ఆదరణ పెరిగింది. ప్రయాణికుల ఆదరణతో ఆదాయం కూడా పెరిగింది. కానీ అర్థం లేని కొన్ని నిబంధనలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మెట్రో సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో, భద్రతా సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రయాణికులకు కొత్త సమస్య తలెత్తింది.
Read also: బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?
ఎల్బీ నగర్ నుంచి ఉదయం 6 గంటలకు తొలి రైలు బయలుదేరింది. నిన్నటి వరకు 5.54 నిమిషాలకు భద్రతా సిబ్బంది ప్రయాణికులను మెట్రో ప్లాట్‌ఫాంపైకి అనుమతించేవారు. కానీ ఈరోజు (ఆగస్టు 24) సరిగ్గా 6 గంటలకు ప్రయాణికులను లోనికి అనుమతించారు. ప్రయాణికులు రైల్వే ప్లాట్‌ఫారమ్‌పైకి రాకముందే మొదటి రైలు ఖాళీగా వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు 6.10 నిమిషాల పాటు రెండో రైలు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. దీనిపై భద్రతా సిబ్బందిని ప్రశ్నించగా.. ఉదయం 6 గంటలలోపు ఎవరినీ లోపలికి అనుమతించబోమని పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఈ విషయంపై మెట్రో సిబ్బంది నోరు మెదపడం లేదు. ఉదయం 5.50 గంటల నుంచి టిక్కెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సమయం మించిపోయినా సెక్యూరిటీ సిబ్బంది ప్లాట్ ఫాం పైకి వెళ్లనివ్వకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Battini Harinath: బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత..
ఉదయం 6.30నిమిషాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు రైలు ఎక్కేందుకు 10 నిమిషాల ముందు స్టేషన్‌కు వస్తే, రైలు వెళ్లిన తర్వాత లోపలికి ఎందుకు అనుమతించాలని వారు అడుగుతున్నారు. స్టేషన్‌కు చేరినప్పటి నుంచి రెండో రైలు ఎక్కే వరకు దాదాపు 30 నిమిషాల సమయం స్టేషన్‌లోనే వృథా అయిపోతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ రోజు గైర్హాజరు అవుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మెట్రో సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. మెట్రోలలో భద్రత విషయానికొస్తే, స్టేషన్ మేనేజ్‌మెంట్ సిబ్బంది వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. అయితే ఆరు గంటలకు మెట్రో రైలును ట్రైంకి నడపడమే కాదు.. అందులో ప్రయాణికులను కూడా ఉండాలా కదా? అనుమతించనప్పుడు ఎలా ప్రయాణికులు ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉదయం 5.45నిమిషాలకే లోనికి అనుమతించాలని కోరుతున్నారు. మరి దీనిపై మెట్రో అధికారలు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
Miyapur Firing: ఎలైట్ రెస్టారెంట్ జనరల్ మేనేజర్‌పై కాల్పులు.. అసలు కథ ఇదీ..!