Husband is suspicious of his wife: హైదరాబాద్ చందానగర్ రాజీవ్ గృహకల్పలో కుటుంబం సూసైడ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. భార్య సుజాతపై అనుమానంతో భర్తే చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను హత్య చేసేందుకు టైలరింగ్ కత్తితో పొడిచినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అనంతరం ఇద్దరు పిల్లలను కూడా హత్మచేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చందానగర్ రాజీవ్ గృహకల్పలో ఓ ఇంట్లో భార్యభర్తలిద్దరు నాగరాజు,భార్య సుజాత జీవిస్తున్నారు. వారికి పిల్లలు రమ్యశ్రీ, టిల్లు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నాగరాజు లూనాపై తిరుగుతూ బ్రెడ్లు అమ్ముతుండేవాడు.. భార్య సుజాత టైలరింగ్ పనిచేసుకుంటూ అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో అనుమానాలు తావులేపాయి. భార్య సుజాతపై భర్త నాగరాజు అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారికాపురంలో రోజు ఏదో ఒకగొడవ జరుగుతుండేది. ఇకరానురాను గొడవ కాస్తా దాడికి కారణమైంది. నాగరాజు, భార్య సుజాతపై అక్కడే వున్న టైలరింగ్ కత్తితో దాడి చేశాడు. కిరాతకంగా ఆమెను పొడిచి చంపాడు. ఇక అక్కడే ఆఘాతుకాన్ని చూస్తున్న పిల్లలను సైతం చంపేసాడు. తాను ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. ఈఘటన గత శుక్రవారం చోటుచేసుకుంది.
ఈరోజు ఉదయం దుర్గంధం రావడంతో ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగిలులగొట్టి తెరిచిన స్థానికులు నిర్ఘాంత పోయారు. ఇంట్లో భర్త నాగరాజు ,భార్య సుజాత పిల్లలు రమ్యశ్రీ,టిల్లు మొత్తం నలుగురు చనిపోయినట్లు గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి భార్య మీద అనుమానంతోనే భర్తే ముగ్గురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. ఇక అక్కడున్న స్థానికులు మాట్లాడుతూ.. మృతులు గత ఏడూ సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నట్లు తెలిపారు.
Private Hospitals: ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా లోపం…నిబంధనలు పాటించకున్నా బేఫికర్