Property dispute: నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలుపుతున్నాయి. డబ్బు, ఆస్తులు, సుఖసంతోషాలు వెతుక్కునే వారిపై దౌర్జన్యం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడిన కొందరు తమ జీవితాన్ని సగంలోనే ముగించుకుంటారు. పరువు పోగొట్టుకున్నందుకు అవమానాలు, మోసాలు తట్టుకోలేక మరికొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ విషయంలో తాళికట్టిన వాడు లేడు, కడుపులో పుట్టినవాడు లేడు. పంచుకున్న రక్తం నుండి పుట్టిన వ్యక్తులు లేరు. నిజానికి ఇలాంటి కు బంధాలకు వావి వరసలు తన మన బేధాలే వుండవు. ఎంతటి కష్టం వచ్చిన అన్నకు తమ్ముడు… తమ్ముడికి అన్న చేదోడు వాదోడుగా ఉండేవారు. కానీ ఓ ఘటన రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి. ఆస్తికోసం అన్న కళ్లలో కారం చెల్లి దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అస్థితగాదా కాస్త కోర్టుకు చేరింది. అయితే కోర్టు వరకు వద్దని మనమే తేల్చుకుందామని తమ్ముళ్లు.. అన్నపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయినా అన్న వినకుండా కోర్టు తీర్పుకోసం వేచి చూద్దామని తెలిపాడు. రాజీపడే సమస్యే లేదని తేల్చి చెప్పాడు. దీంతో అన్నపై కోపం పెంచుకున్న తమ్ముళ్లు దాడి చేయాలని ప్లాన్ వేశారు. దీంతో ఇంటికి వచ్చిన తమ్ముళ్లు గట్టు రమేష్, గట్టు కృష్ణ అన్న కుమారస్వామికితో మాట్లాడుతూ ఒక్కసారిగా వారితో తెచ్చుకున్న కారం పొడిని అన్న కళ్లలో చెల్లి దాడి చేశారు. కుమారస్వామి గట్టిగా అరవడంతో ఇంట్లో వున్న కుటుంబ సభ్యులు పరుగున బయటకు రావడంతో గట్టు రమేష్, గట్టు కృష్ణలు అక్కడి నుంచి పరారయ్యారు. అన్న గట్టు కుమారస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. గట్టు రమేష్, గట్టు కృష్ణలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ లో రికార్డ్ అయిన దాడి దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
CM Jaganmohan Reddy Sri Lakshmi Maha Yagnam Live: శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం వైయస్ జగన్