రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలులు (Schools) పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. దీంతో విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని హుశారుగా తరగతులకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేశారు. కాగా.. స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నగరంలోని మెహబూబియా స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం సబితారెడ్డి…