TGPSC: హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లో కలవరం సృష్టిస్తోంది. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కమిషన్ పునరాలోచనలో పడింది. ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని TGPSC యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
France: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియామకం
మంగళవారం నాడు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమై ఈ అంశంపై లోతుగా చర్చించారు. మరోసారి మూల్యాంకనం చేస్తే ఎదురయ్యే సమస్యలు, దాని వల్ల కలిగే ఇబ్బందులపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ప్రక్రియ వల్ల సమయం వృథా అవడంతో పాటు, కొత్త వివాదాలు తలెత్తే అవకాశం ఉందని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.
కేవలం కమిషన్ మాత్రమే కాకుండా, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించాలని TGPSC నిర్ణయించుకుంది. ప్రభుత్వం నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటించనుంది. ఈరోజు దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రీవాల్యుయేషన్ వల్ల జాప్యం జరిగి, అభ్యర్థులకు కూడా అసౌకర్యం కలుగుతుందని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, న్యాయపరంగా ముందుకు వెళ్లాలా లేక కోర్టు ఆదేశాలను పాటించాలా అనే దానిపై ఒక స్పష్టత కోరుకుంటోంది. ఈ పరిణామాలన్నీ గ్రూప్-1 పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులలో ఉత్కంఠను పెంచుతున్నాయి. కమిషన్ తీసుకోబోయే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Malayala Beauty : టాలీవుడ్‌లోకి మరో కేరళ కుట్టి.. బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అయిన స్టార్ హీరో కొడుకు