TGNPDCL : 6,057 MW Power Demand.. ఫిబ్రవరిలోనే సెగలు.. రికార్డ్ బ్రేక్.!
- ఫిబ్రవరిలోనే 6,057 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు
- గత ఏడాది రికార్డును బద్దలు కొట్టిన విద్యుత్ వినియోగం
- 35 కొత్త సబ్‌స్టేషన్లు, 366 ట్రాన్స్‌ఫార్మర్లతో మౌలిక సదుపాయాల బలోపేతం
- వేసవి డిమాండ్‌ను తట్టుకునేందుకు పూర్తి సన్నద్ధతలో సంస్థ
TGNPDCL power demand : తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డును సృష్టించింది. సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యంత గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో కనిపించే గరిష్ట వినియోగం, ఈసారి ముందే రావడం గమనార్హం. గత ఏడాది మార్చి 11వ తేదీన నమోదైన 5,816 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ, ఈరోజు ఏకంగా 6,057 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఎండల తీవ్రత పెరగడం , వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ వినియోగం భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.
Adulterated Milk: కల్తీ పాల ఘటనలో 11 మంది పరిస్థితి విషమం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
ఈ స్థాయిలో డిమాండ్ పెరిగినప్పటికీ, వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థ ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని సీఎండీ భరోసా ఇచ్చారు. పెరిగిన లోడ్‌ను సమర్థవంతంగా తట్టుకునేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను భారీగా మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 35 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లను ఛార్జ్ చేయడంతో పాటు, అదనంగా 366 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఓవర్‌లోడ్ సమస్య తలెత్తకుండా సుమారు 7,600 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా సరఫరాలో నాణ్యతను పెంచినట్లు పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టారు. ముఖ్యంగా ఓవర్‌లోడ్ అధికంగా ఉన్న ఎనిమిది 33 కేవీ ఫీడర్లను విభజించి లోడ్ బ్యాలెన్సింగ్ చేయడంతో పాటు, సుమారు 1,200 కిలోమీటర్ల మేర ప్రత్యామ్నాయ 33 కేవీ లైన్లను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ అందించే అవకాశం ఉంటుంది. వేసవి కాలం దృష్ట్యా మున్ముందు డిమాండ్ ఇంకా పెరిగినా, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉందని సీఎండీ స్పష్టం చేశారు.
US-Iran: యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి దాడులు.. ఖమేనీ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగం
తాజావార్తలు
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్‌తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్‌కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!