TS TET HALL TICKETS 2022: నేటి నుంచి హాల్ టికెట్ల జారీ.. అర్హత పరీక్ష?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెట్‌ను (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు. టెట్ పేపర్-1 కోసం 3,51,468 మంది, పేపర్-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటించారు. పేపర్-1 పరీక్ష ఉదయం, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం జరగనున్నాయి.
కాగా.. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం టెట్ మోడల్ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నారాయణగూడలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి తదితరులు ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. అలాగే.. యూటీఎఫ్ ఆధ్వర్యంలోనూ ఆదివారం టెట్ మోడల్ పరీక్ష జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని మూడు సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్టు యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. అయితే.. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూ తదితర సంస్థల్లో పీజీ సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నుంచి కామన్ ఎంట్రన్స్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
Brad Hogg: ఆ ఇద్దరిని తొలగించి.. మంచి పని చేశారు
- Tags
- 2022
- hall tickets
- june-6
- released
- ts tet
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!