టెట్‌ను (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు. టెట్ పేపర్-1 కోసం 3,51,468 మంది, పేపర్-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటించారు. పేపర్-1 పరీక్ష ఉదయం, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం జరగనున్నాయి. కాగా.. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం టెట్ మోడల్ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నారాయణగూడలోని పీఆర్‌టీయూ…