Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత… మోహరించిన ఏపీ, తెలంగాణ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar Dam: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పై ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి నుండి టెన్షన్ కొనసాగుతుంది. నిన్న ఏపీ బలవంతంగా కుడి కాలువ నుండి 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసుకున్నారు. తాగునీటి కోసమే నీటి విడుదల చేసుకున్నట్లు ఏపీ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కృష్ణ రివర్ బోర్డ్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి నాగార్జునసాగర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాం వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
Read also: Chandrababu: నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం..
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
నిన్న రాత్రి ఏపీ పోలీసులు మెయిన్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి 13 గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు. ప్రాజెక్టు అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏపీ అధికారులు 5వ గేటు నుంచి కుడి కాల్వలోకి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గురువారం ఉదయం నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియలో ఏపీ తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీ కుడి కాలువ నుంచి కేవలం తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేశామన్నారు. ఓటింగ్ ముగియడంతో తెలంగాణ పోలీసు బలగాలు పెద్దఎత్తున డ్యాం వద్దకు చేరుకుంటున్నాయి. అవసరమైతే జేసీబీతో ఇనుప కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read also: Animal Twitter Review : దుమ్ము దులిపేసిన రణబీర్..సినిమా ఎలా ఉందంటే?
ఆంధ్రప్రదేశ్ విభజనతో నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఏపీ అధికారులు మాత్రం తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని… తమ వాటా నీటి వాటా కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. దీంతో పాటు పోలీసుల సాయంతో సాగర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఏపీ పోలీసులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడి ఈ వివాదాన్ని పరిష్కరిస్తారని… ముళ్ల కంచెను తొలగించి వెనక్కి వెళ్లాలని ఏపీ పోలీసులకు సూచించారు. అయినా ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో ఉద్రిక్తత కొనసాగింది.
Karthika Friday: ఈ స్తోత్రాలు వింటే సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!