Yadagirigutta: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్న దృష్ట్యా కొన్ని రోజువారీ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఎల్లుండి (మంగళవారం) నుంచి జయంత్యుత్సవం ప్రారంభం కానున్నందున స్వామివారి నిత్యకల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. మొక్కు కళ్యాణం చేసే భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. జయంత్యుత్సవం పూర్తయిన తర్వాత మే 5వ తేదీ నుంచి బ్రహ్మోత్సవం, నిత్యకల్యాణం, హోమం తిరిగి ప్రారంభమవుతాయని వివరించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు నిత్యకల్యాణాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో గీత వెల్లడించారు.
Read also: India’s fuel exports: యూరప్‌కి అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా అవతరించిన భారత్..
వేసవి కారణంగా భక్తుల రద్దీ పెరుగుతున్నందున సేవల నిలిపివేతను భక్తులు గమనించాలని ఈవో సూచించారు. యాదాద్రి ఆలయ వెబ్‌సైట్‌ను కూడా తాత్కాలికంగా మూసివేశారు. తిరుమల తరహాలో దేవస్థానం పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని వీటీడీఏ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పోర్టల్ www. yadadritemple.telangana.gov.inలో లోపాలు గుర్తించబడ్డాయి. వాటిని సరిదిద్దడంతో పాటు భక్తులకు మరింత పటిష్టంగా, వేగంగా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోర్టల్ అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పోర్టల్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
India’s fuel exports: యూరప్‌కి అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా అవతరించిన భారత్..