Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
- పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్ల ప్రతిపాదనలు
- వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక
- వ్యర్థాలతో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
- మురుగునీటి శుద్ధి, పునర్వినియోగంపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు అవకాశముంది.
Also Read
- OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
- Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
- Illandu Missing Person : ఇల్లందులో 45 రోజులుగా కనిపించని వ్యక్తి.. వీడని మిస్టరీ
- Nitin Nabin : తెలంగాణకు నితిన్ నబీన్.. రెండు పాదయాత్రల ప్లాన్
పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించే అంశాలపై చర్చించారు. వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను సమీక్షించారు. బయో సీఎన్జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, పురపాలక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!