తిరుపతి రూరల్ (మం) దామినీడులో నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సూచన మేరకు ఆర్డీవో, డిఎస్పీ ఇరువురితో సమాలోచన జరిపారు. కూల్చి వేసిన ప్రాంగణాన్ని యధావిధిగా గ్రామస్థులకు వదిలేయాలని కృష్ణమూర్తి నాయుడుకి ఆదేశాలు జారీ చేశారు. నేలమట్టం చేసిన ప్రాంతంలోనే తిరిగి ఆలయాన్ని పునర్ నిర్మించాలని సూచించారు. నెలరోజుల్లో ఆలయ నిర్మాణాన్ని యధావిధిగా నిర్మిస్తానని కృష్ణమూర్తి నాయుడు అంగీకరించారు.
X Blocks Accounts: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే భారీ జరిమానాలు, దేశీయ ఉద్యోగులకు జైలుశిక్ష విధించబడతాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బ్లాక్ చేయబడిన ఖాతాల్లో అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఉన్నట్లు సమాచారం. X కంపెనీ ప్రకటనలో తెలిపిన ప్రకారం,…
Civil Mock Drill : పహల్గామ్ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితిలు మారిపోయాయి.. అయితే.. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించింది. రేపు జరగబోయే మాక్ డ్రిల్‌లో అనుసరించాల్సిన దశలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యం ప్రజలను అప్రమత్తం చేయడం, విపత్కర పరిస్థితుల్లో స్పందించే విధానంపై శిక్షణ ఇవ్వడం , సంబంధిత…
Group 1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గ్రూపు-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ 20 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం కోర్టు విచారణ ప్రారంభించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నియామక పత్రాలు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఇటీవల,…
CM Chandrababu Naidu: ప్రజల ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాలన్నారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుకు గ్రీవెన్స్ స్థితిని తెలిపేలా సమాచారం అందించాలన్నారు సీఎం. ఇందుకు ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని చెప్పారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారుకు… ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని సవివరంగా తెలియజేయాలని సూచించారు. గ్రీవెన్స్‌ల పరిష్కారంపై సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించారు…
మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. మూసీ నది పరిసరాల్లో నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలు అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి నాలుగు మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూసీకి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ కల్పించి, ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే, 50 నుంచి 100 మీటర్ల మధ్య ప్రాంతంలో కొత్తగా…
HYDRA: హైదరాబాదులోని అమీన్ పూర్‌లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల…
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొంది ప్రభుత్వం..
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ ను ప్రత్యేక అధికారి గా నియమించింది.