Telangana National Unity Day: నేడు రాష్ట్రవ్యాప్తంగా సమైక్యతా ఉత్సవాలు.. ముస్తాబైన తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి వద్ద గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా ఎగురవేశారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్లోలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో చేరిన సందర్భంగా.. నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నగరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఇక.. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్‌లో నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమ్రంభీం ఆదివాసీ భవన్లను మధ్యాహ్నం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇక దాదాపు ఆరు వేల మంది కళాకారులతో సీఎంకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. దీంతో.. భవనాల ప్రారంభం సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గిరిజన కళారూపాలతో భారీ ప్రదర్శన నిర్వహించి.. గుస్సాడీ, గోండు, లంబాడీ తదితర 33 రకాల కళారూపాలు ప్రదర్శించే కళాకారులు భారీ ర్యాలీలో పాల్గొంటారు. ఈనేపథ్యంలో.. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఆదివాసీ, బంజారా ఆత్మీయసభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రముఖులను సభకు ఆహ్వానించారు. అయితే.. వారు వచ్చేందుకు వీలుగా జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు, వాహనాలు ఏర్పాటు చేశారు. ఇక పద్మశ్రీ అవార్డు పొందిన కనకరాజు, రామచంద్రయ్యలకు కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దీంతో.. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో చేరిన సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ జెండా ఎగరవేసి గౌరవవందనం స్వీకరిస్తారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానికసంస్థల పరిధిలోని కార్యాలయాల్లోనూ జాతీయజెండా ఎగరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఇవాళ సాధారణ సెలపు ప్రకటించారు. ఈసందర్బంగా.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!